శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): జైగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్సీ జగదేవ్ గుత్తేదార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్ గౌడ్, మాజీ ఎంపీ భరత్ గౌడ్, నవీన్ బండారి, రాజా నాడార్, గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేఎం ప్రతాప్ గౌడ్, కళ్లెం వీరస్వామి గౌడ్, కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్, జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాదు సత్యం గౌడ్, హిమాయత్ నగర్ కార్పొరేటర్ జి.రామన్ గౌడ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుండి గౌడ ప్రముఖులు, సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నేతలు ఐలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి రామకృష్ణ గౌడ్, బొంగు రఘు గౌడ్, పటేల్ వెంకటేష్ గౌడ్, బిసీ సంఘం నాయకులు ఓరుగంటి వెంకటేశం గౌడ్, దుర్గయ్య గౌడ్, యుగంధర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేవతి గౌడ్, విద్యార్థి నాయకుడు సాంబశివ గౌడ్, అమర గాని వెంకన్న గౌడ్, కుర్ర శ్రీనివాస్ గౌడ్, కలర్ సత్తన్న గౌడ్, గుగ్గిళ్ళ జగన్ గౌడ్, జై గౌడ్ నేతలు శేషగాని నరేష్ గౌడ్, ఉయ్యాల వెంకటేష్ గౌడ్, మార్కం రవి గౌడ్, మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్, అనురాధ గౌడ్, ప్రగతి గౌడ్, బొమ్మగాని శంకర్ గౌడ్, కేశవ్ గౌడ్, భాను గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, వెంకట స్వామి గౌడ్, రంగోల మురళి గౌడ్, వివిధ జిల్లాల నుంచి గౌడ ప్రముఖులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్, జైగౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్, ఆంధ్ర ప్రదేశ్ జై గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, మహారాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్ సిల్లేవార్ ధన్యవాదాలు తెలియజేశారు.






