శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని స్ప్రింగ్ వ్యాలీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎబియన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మ్యూజిక్ స్కూల్ ను ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషదాయకం అని అన్నారు. ఇలాంటి మ్యూజిక్ స్కూల్స్ మరిన్ని బ్రాంచ్ లుగా ప్రారంభించుకోవాలని అందుకు కస్టమర్లకు అన్ని సదుపాయాలు కల్పించి వారి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జరీన్, ఐలేష్ యాదవ్ మ్యూజిక్ స్కూల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.






