బి కె ఎన్‌క్లేవ్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 7 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని బి కె ఎన్‌క్లేవ్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు విభాగాల సంబంధిత అధికారులు, కాలనీ వాసులు, స్థానిక నాయకులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సంధర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ బి కె ఎన్‌క్లేవ్ కాలనీలో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై పాదయాత్ర చేయడం జరిగింద‌ని, కాలనీలో ఉన్న సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగింద‌ని అన్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామ‌ని తెలిపారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ సంతోష్, ఎస్ ఆర్ పి కనక రాజు, కుర్మయ్య, శ్రీనివాస్, లింగయ్య, నవీన్, బి కె ఎన్‌క్లేవ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎం సి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పద్మ, రాజేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జిహెచ్ఎంసి పలు విభాగాల సంబంధిత అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here