ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయం: కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత సిద్ధాంతకర్త , ప్రొఫెసర్ జయశంకర్‌ 91వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ చిత్ర పటానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పూల‌మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుడుతూ జయశంకర్ తెలంగాణ రాష్త్ర సాధన తొలి ఉద్యమకారుడ‌ని, త‌న తుది శ్వాస వరకు అహర్నిశలు తెలంగాణ కోసం తపించిన మహానుభావుడు జయశంకర్ అని, ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు , రాగం జంగయ్య యాదవ్ , దారుగుపల్లి నరేష్, అంజమ్మ , జగదీశ్ , ఆకుల యాదగిరి, శామ్లెట్ శ్రీనివాస్ మధు, అజీమ్ , ఖాదర్ ఖాన్ , వెంకట్ రెడ్డి , సురేష్ , తాహెర్ , బురాన్ , బాలామని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here