శ్రీరామకృష్ణవివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో యువ వికాస్ తరగతులు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంగ్ల వ్యాకరణ నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యక్తిత్వవికాసం, సంగణన విజ్ఞానశాస్త్ర శిక్షణాంశాలుగా యువ వికాస్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ప్రత్యేకశిక్షఫ‌ తరగతులును కళాశాలల విద్యార్థులకు 2025-26 విద్యాసంవత్సరంలో శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి, KPHB మియాపూర్ నిర్వహిస్తుంద‌ని నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. కళాశాలల పేద విద్యార్థులకు కొంతమందికి నెలవారీగా ఉపకారవేతనాలు ఇస్తుంద‌ని, కూకటపల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాలలోని విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించిన‌ట్లు తెలిపారు. ఔత్సాహికులు శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి ధ్యాన మందిరం, ప్లాట్ 166, రాధామాధవ్ అపార్ట్ మెంట్ జంక్షన్ దగ్గర, ప్రగతి ఎంక్లేవ్ కాలని, మియాపూర్ అనే చిరునామాలో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని, మ‌రిన్ని వివ‌రాల‌కు ఫోన్ నంబ‌ర్‌ 9059892038లో సంప్ర‌దించాల‌ని సూచించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here