శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని డోయన్స్ కాలనీలో ముంపు సమస్య పరిష్కారానికి నూతనంగా చేపట్టబోయే వరద నీటి కాలువ నిర్మాణం పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ డోయన్స్ కాలనీ ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన వర్షకాలంలో చెరువు నిండి లోతట్టు కాలనీలు ముంపుకు గురి అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని , దీనికి శాశ్వత పరిష్కారంగా ఔట్ లెట్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి, వరద నీటి కాలువ నిర్మాణం పనులను త్వరలోనే చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శిరీష , DE ఆనంద్, నాయకులు మారబోయిన రాజు యాదవ్ , ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, డోయన్స్ కాలనీ వాసులు లింగారెడ్డి, నర్సింహ రెడ్డి, ప్రకాష్, రామకృష్ణ, అనంత రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






