శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు నుండి చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువు వరకు నూతనంగా వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను SNDP అధికారులు, చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పటేల్ చెరువు నుండి గంగారం చెరువు వరకు, వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం కోసం వరద నీటి కాల్వ నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను ఎస్ఎన్డిపి అధికారులతో కలసి పరిశీలించడం జరిగిందని, వరద నీటి కాలువ నిర్మాణం పనులను త్వరలో ప్రారంభించి పూర్తిచేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డిపి డిఈ ధీరజ్, స్థానిక నాయకులు సందీప్ రెడ్డి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.






