శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన నీరుసా బాంక్వెట్ హాల్ ను కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్..
లింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నీరుసా బాంక్వెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షుడు బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, బొల్లంపల్లి నవీన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సిదార్థ్, జమాల్పూర్ సాయినాథ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.






