తెరాస అభ్య‌ర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హైద‌ర్‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికలలో హైదర్ నగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాస రావుని భారీ మెజారిటీతో గెలిపించి కార్పొరేట‌ర్ సీటును ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల‌కి కానుకగా ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శ‌నివారం డివిజ‌న్ ప‌రిధిలోని కొలన్ రాఘవ రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో టీఎస్‌క్యాబ్ ఛైర్మ‌న్ కొండూరు రవీందర్ రావు, నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస పార్టీ ఇంచార్జ్ తోట ఆగన్న, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వ‌హించిన‌ ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడుతూ.. తెరాస అభ్య‌ర్థుల గెలుపుకు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైనికుల్లా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. పార్టీని బ‌లోపేతం చేయాల‌న్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

తెరాస‌లో అందరికీ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు రూ.1,00,116 ఇవ్వడం జరుగుతుందని, ఆసరా పింఛన్లు, ఒంటరిమహిళా పింఛన్లు, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, రైతు బంధు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాల‌ను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, తెరాస నాయకుడు రంగ‌రాయ ప్రసాద్, హైదర్ నగర్ డివిజన్ వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళా నాయకులు, బస్తీ నాయకులు, తెరాస పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పాల్గొన్న తెరాస ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here