- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో సమావేశం
గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): మీడియా రంగంలో తెలంగాణ యాస, భాషలతో తనకంటు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న తెలంగాణ యాంకర్ కార్తిక. కత్తిలాంటి మాటలతో ప్రముఖులను ఇంటర్వూలు చేసి తన ఇంటి పేరునే కత్తిగా మార్చుకున్న కార్తిక త్వరలో బిజెపి లో చేరబోతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో శనివారం సమావేశమైన కార్తీక మరో రెండు రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
తాజాగా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసింది కార్తీక. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడా ప్రాంతంలో నివాసం ఉంటూ గత కొంత కాలంగా కార్తిక ఫౌండేషన్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవల కరోనా విజృంభన నేపథ్యంలో నిరుపేదలకు తన ఫౌండేషన్ తరపున అనేక రకాలుగా కార్తీక చేయూతనందించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు యువత నుంచి మంచి స్పందన లభించడం తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల వేళ బీజేపీ లో చేరనుంది.