శేరిలింగంపల్లి, జూలై 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగు సారస్వత పరిషత్ తెలంగాణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ రాంప్రసాద్ ప్రకటించారు. అధ్యక్షుడిగా కలిదిండి విశ్వనాథరాజు, కార్యనిర్వహక అధ్యక్షుడిగా కాసాని వీరేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా విద్య వెంకట్, యోగేష్ ప్రభు, ప్రధాన కార్యదర్శిగా చంద్రహాస్ ఇప్పలపల్లి, సంయుక్త కార్యదర్శిగా మంకర రాజు (ప్రజ్ఞ రాజు), కోశాధికారిగా సుధీర్ కాలనాధభట్ల, కార్యదర్శులుగా మధుసూదన రాజు, శైలజ మిత్ర, కార్యదర్శులు ఇందుకూరి సూర్యప్రభ, ఆమంచి నాగ పరిమళ, వాసర వేణి పరుశురాం, కార్యనిర్వహక కార్యదర్శులు గా నాంపల్లి వెంకట సాయి, ప్రచార కార్యదర్శులు గా యులుసాని మోహన్ కుమార్, డాక్టర్ ఏ వి ఆర్ మూర్తి, కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, నారు (కార్టూనిస్ట్), వారణాసి రాంప్రసాద్, సముద్రాల కిరణ్, గౌరవ సలహాదారులుగా హేమ సుందర రావు మంగళాపురపు(సీనియర్ జర్నలిస్ట్), దుర్గం రవీందర్ (జర్నలిస్ట్), పొత్తూరి శ్యామల రాజు, కమలాపురపు విఠల్ రావు తదితరులు నియమితులయ్యారు.






