శేరిలింగంపల్లి, జూలై 7 (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల కారు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ MLC శంభీపూర్ రాజుని హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల రామకృష్ణ గౌడ్, లింగంపల్లి తిరుపతి రెడ్డి పరామర్శించారు. శంబీపూర్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట స్థానిక నాయకులు ఉన్నారు.






