శేరిలింగంపల్లిలో ఘ‌నంగా గురు పౌర్ణమి వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, జూలై 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, హుడా కాలనీలో బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ మహిళ మోర్చా సమక్షంలో గీతా పారాయణ ప్రవచనం, మహిళలకు ఆషాడమాసం గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పా రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రపంచం ఎంతగా మారినా, మనిషి జీవితం ఎంత మారినా… భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచీ చావు దాకా, నాయకత్వం దగ్గర నుంచీ యుద్ధం దాకా ప్రతి రంగానికీ ఉపయోగపడుతోంద‌న్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, మహేశ్వర్, వేముల వేణుగోపాల్, పద్మా, మేరీ, పార్వతి, నిర్మల, వినయ, దేవాల్, శ్రీనివాస్ యాదవ్, పవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here