- కాషాయ కండువ కప్పుకున్న జానకి రామ రాజు
హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్‌నగర్ డివిజన్ తెరాస సిట్టింగ్ కార్పొరేటర్ జానకి రామరాజు బీజేపీలో చేరారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెరాస విడుదల చేసిన తుది జాబితాలోనూ ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో జానకి రామ రాజు బీజేపీలో చేరారు. హైదర్‌నగర్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా హైదర్‌నగర్ తెరాస అభ్యర్థిగా ఇప్పటికే నార్నే శ్రీనివాస రావు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.