చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ నుంచి తెరాస రెబల్ కార్పొరేటర్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెరాస నాయకులను నమ్ముకుని ఉంటే తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో ఇంతకాలం సేవలందించినందుకు టిక్కెట్ వస్తుందని ఆశించానని, కానీ తనను నమ్మించి మోసం చేశారన్నారు. డివిజన్‌లో తన బలమేంటో చూపిస్తామన్నారు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
