శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు త్వరలో నూతనంగా చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన చేపట్టాలని కాలనీ వాసులు సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీదేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలోనే పనులు చేపట్టబోతున్నాం అని , త్వరితగతిన పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని , చుట్టుపక్కల కాలనీ వాసులకు , ప్రజలకు సాంత్వన చేకూరేలా పనులు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.