శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, క్రిస్టియన్ లందరికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పర్వదినం ను పురస్కరించుకుని క్రైస్తవలందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు. క్రిస్మస్ పండుగ ను ఘనంగా నిర్వహించుకోవడానికి చర్చిల వద్ద అన్ని రకాల వసతులు కలిపించాలని , ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించారు.