ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా భేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా భేరి రామచంద్ర యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కొమరం భీమ్, డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాల కనుగుణంగా రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సేవ చేస్తానని రామచందర్ యాదవ్ అన్నారు. త‌న‌పై నమ్మకం ఉంచి ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ శాశ్వత రాష్ట్ర అధ్యక్షుడు కొత్త విజయభాస్కర్ త‌న‌కు గౌర‌వ‌ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించార‌ని, ఆయ‌న‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తూచా తప్పకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన పలువురు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు బేరి రామచందర్ యాదవ్ ని ప్రత్యేకంగా అభినందించారు. అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి బేరి రామచందర్ యాదవ్ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

భేరి రామచందర్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here