అంబేద్క‌ర్‌కు ఘ‌న నివాళులు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసే ఏకైక పార్టీ బీజేపీ అని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. డా బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా శేరిలింగంపల్లి డివిజన్ మసీద్ బండ చౌరస్తాలోని డా.బి.ఆర్. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ్ , బాలరాజు, రాము , ప్రశాంత్, చింటు, వినోద్ , బీజేపీ నాయకులు సదానంద్ యాదవ్, ఆంజనేయులు సాగర్, రాజు , పద్మ, కుమార్ యాదవ్, శ్రీకాంత్, నరసింహ, కరణ్, సహదేవ్, పరమేశ్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న ర‌వికుమార్ యాద‌వ్

ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్‌లో..

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ PJR నగర్ లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడిగాంధీ అంబేద్క‌ర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, పాండు గౌడ్, జిల్లా గణేష్, శివరాజ్ గౌడ్, జి.రవి, మరేళ్ల శ్రీనివాస్, అష్రఫ్ , CH. భాస్కర్, గుడ్ల శ్రీనివాస్, యాదగిరి, అగ్రవాసు, బాలస్వామి, మల్లేష్, మోజెస్, ముజీబ్, మహేష్, నరసింహులు, రవీందర్, మజర్, బషీర్, ఖలీమ్, ఇంతియాజ్, సాయి, దనుంజయ్, ప్రసాద్, నరసింహులు, రాజు పాల్గొన్నారు.

మియాపూర్‌లో..

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 68వ వర్థంతి సందర్భంగా మియాపూర్ నడిగడ్డ తండాలో ఆయన విగ్రహానికి ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవనూర్ నరసింహ, క్రిష్ణ నాయక్, బి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ BR అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు అల్వర్ స్వామి నాయక్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పిచారు. తిరుపతి నాయక్, గోపి నాయక్, లకపతి నాయక్, సర్య నాయక్, సచిన్, నరేష్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్‌లో..

బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హామీద్‌ పటేల్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హామీద్ పటేల్ తోపాటు స్థానిక సీనియర్ నాయకుడు నందు, సిద్దిక్ నగర్ బస్తీ అధ్యక్షుడు కే బసవరాజు, లక్ష్మి బాయ్, విజయ్, వినోద్ యాదవ్, యం శ్రీను, రవి, సదర్ సాయి, సదర్ రాము, గణపతి, బుడుగు తిరుపతి రెడ్డి, పెద్ద రవి, కే. రవి, బళ్ళు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here