శ్రీ‌చైత‌న్య పాఠ‌శాల‌లో మెగా ర‌క్త‌దాన శిబిరం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినం సందర్భంగా చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ & దుర్గాబాయి దేశ్ ముఖ్ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేందర్ రావు, GM రవి కుమార్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ మహా రక్త దానం శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తప్పనిసరిగా రక్తదానం చేయాలని, నిండు ప్రాణాలను కాపాడినవారు అవుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డీన్ లు సురేందర్ బాబు, శంకర్ రావు, శ్రీనివాస రావు, AGMలు రాంబాబు, హరి, మాధవ్, చంటి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్, సందీప్ రెడ్డి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

ర‌క్త‌దాన శిబిరంలో పాల్గొన్న మ‌హిళ‌కు ధ్రువ‌ప‌త్రాన్ని అంద‌జేస్తున్న పీఏసీ చైర్మ‌న్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here