శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): సమగ్ర కుల గణన సర్వేలో భాగంగా ఇళ్లకు వచ్చే అధికారులకు కచ్చితమైన సమాచారం అందించాలని ఏఐబీఎస్ఎస్ స్టేట్ జాయింట్ సెక్రెటరీ ఆల్వార్ స్వామి నాయక్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుల గణనలో భాగంగా గ్రామం అంటే తండాని రాయాలని అన్నారు. అలాగే మాతృభాషను లంబాడి అని మాత్రమే రాయాలని అన్నారు. రిజర్వేషన్ గెజిట్లో లంబాడి ఉన్నందున అదే పదాన్ని రాయాలని సూచించారు. లంబాడిలను ఎస్టీల నుంచి తీసేసే కుట్ర జరుగుతుందని, ఇందుకు గాను సుప్రీం కోర్టులో కేసు వేశారని, కనుక లంబాడిలు జాగ్రత్తగా సమాచారం అందించాలని సూచించారు.