స‌మ‌గ్ర కుల గ‌ణ‌న స‌ర్వే చేప‌ట్ట‌డం అభినంద‌నీయం.. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో వివేకానంద నగర్ లోని సప్తగిరి కాలనీలో ఉన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇంటికి డీసీ కృష్ణయ్య, GHMC అధికారులు స్టిక్కర్ అంటించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుల గణన చేపట్టడం జరిగింద‌ని, చాలా గొప్ప విషయం అని అన్నారు. ప్రజలు కూడా కులగణన కోసం వచ్చిన అధికారులకు పూర్తిగా సహకరించాలని, నిజాలు మాత్రమే చెప్పాలని, అప్పుడే సరైన కుల జాబితా రూపొందుతుంద‌ని, ప్రతి ఒక్కరు కులగణన కార్యక్రమంలో పాల్గొని పూర్తి వివరాలు అందించాలని కోరారు.

ఎమ్మెల్యే గాంధీ ఇంటికి స్టిక్క‌ర్‌ను అతికిస్తున్న ఎన్యుమ‌రేట‌ర్
ఎన్యుమ‌రేట‌ర్ల‌కు వివ‌రాల‌ను తెలియ‌జేస్తున్న ఎమ్మెల్యే గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here