శేరిలింగంపల్లి, అక్టోబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ను మియాపూర్‌కు చెందిన ఇస్కాన్ ప్రతినిధి రామదాస బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సహాయం చేయాలని, అంశు ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అవసరం అయిన సహాయ సహకారాలను అందించాలని కూడా కోరారు. ఇందుకు శైలజ సానుకూలంగా స్పందించారని రామదాస తెలిపారు.