శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ఉత్సాహంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మియాపూర్ డివిజన్, హైదర్ నగర్, లింగంపల్లి డివిజన్లలలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి మరింత వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజవర్గ ముఖ్య నాయకులు విధిగా 500కు మించకుండా సభ్యత్వ నమోదు చేపట్టాలని, రాష్ట్రంలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో ఉండాలని కోరారు. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి రోజురోజుకీ ఆదరణ పెరిగి స్వచ్ఛందంగా ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, మణి భూషణ్, నాగుల్ గౌడ్, రవీందర్రావు, మాణిక్ రావు, నవీన్ గౌడ్, అరుణ్ కుమార్, ఎల్లేష్, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, లక్ష్మణ్, గణేష్, రాజేష్ పాల్గొన్నారు.