ఘ‌నంగా ముగిసిన వెంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

చందానగర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా ముగిశాయి. చివ‌రి రోజు గురువారం స్వామి వారికి సుప్రభాత సేవ, సాలగ్రామార్చన, స్వామి వారికి బాలభోగం, ఉత్సవస్తపానం, విష్వక్సేనపూజ, విశేష పుష్ప గజమాలలతో స్వామి వారి అలంకారదర్శనం నిర్వ‌హించారు. అలాగే సాయంత్రం ఉభయ దేవేరులతో పుష్పక వాహన సేవ, విశేష పూజలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దాతలు, ఆలయ మహారాజ‌ పోషకులు కలిదిండి సత్యనారాయణ రాజు, ఝాన్సీలక్ష్మిల‌ను సన్మానించారు. ఈ పూజ‌ల‌కు ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య క‌మిటీ అధ్య‌క్షుడు కె.ర‌ఘుప‌తి రెడ్డి, ఉపాధ్య‌క్షులు టి.సుబ్బారాయుడు, పి.అశోక్ గౌడ్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుభాష్‌, కోశాధికారి ఎన్‌.అశోక్ కుమార్‌, ఉప కార్య‌ద‌ర్శి కె.దేవేంద‌ర్ రెడ్డి, కార్య‌వ‌ర్గ స‌భ్యులు కె.వెంక‌ట శేష‌య్య‌, ఎస్‌.నాగేశ్వ‌ర్ రావు, ఎ.బ్ర‌హ్మ‌య్య గుప్తా, సీహెచ్ రాంగోపాల్‌, బ‌చ్చు శ్రీ‌కాంత్‌, ఆలయ ప్రధాన అర్చకుడు సుదర్శనం సూర్య పురుషోత్తమ సత్య సాయి పాల్గొన్నారు.

 పుష్పక వాహనంలో భక్తులకు దర్శనమిస్తున్న గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి
 బ్రహ్మోత్సవాల ముగింపు పూజల్లో పాల్గొన్న ఆలయ మహారాజ పోషకులు కలిదిండి సత్యనారాయణ రాజు ఝాన్సీలక్ష్మి దంపతులు 
అద్దాల మేడలో ఆకట్టుకుంటున్న శ్రీవారి పవలింపు ఊయల
బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో పూజ‌ల్లో పాల్గొన్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here