శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన PAC కమిటీ చైర్మన్ గా శాసనసభ కమిటీ ఆవరణంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సభాపతి కార్యాలయంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గాంధీని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సామ్యుల్ కార్తీక్, యువజన, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.