శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మ శ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు అధ్వర్యంలో శనివారం అన్నమ స్వరార్చన సందర్భంగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి కూచిపూడి నృత్యాభినయం నిర్వహించారు. తొలుతగా విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమాచార్య అష్టోత్తర శతనామావళి, అన్నమ గాయత్రి అనే గురు స్తుతితో ప్రారంభించగా, అన్నమ స్వరార్చనలో భాగంగా శ్రీ శారదా కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు టి. వి. జయశ్రీ, వారి శిష్యుబృందం కార్తిక, అక్షయని, మణిమేఖల, వరుణి, భార్గవి, ప్రణవిక, ప్రవస్తి, అన్విత, సహస్ర, జోవిత, వైభవి, తపిత, మోక్షిత, గానవి, సుధీక్ష, ఆరాధ్య, శాంభవి, శ్రీవిద్య, చిద్విలాసిని, శాన్వి, సౌమ్య, చైత్ర సంయుక్తంగా కూచిపూడి నృత్యార్చన చేశారు.
ఇందులో భాగంగా, వినాయక వందనం, వినరో భాగ్యము, ముద్దుగారే యశోద, అదిగో అల్లదిహో, భావములోన బాహ్యమునందును, తందనానా అహి, జయలక్ష్మి – వరలక్ష్మి అనే ప్రఖ్యాత అన్నమయ్య సంకీర్తనలకు నయనామృతంగా నృత్యాభినయం చేసి శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామివారిని భక్తి పూర్వకంగా సేవించి అందరినీ ఆనందపరిచారు. అనంతరం డా. శోభా రాజు ఒక అన్నమయ్య సంకీర్తనకు విశ్లేషణ ఇచ్చారు. అనంతరం కళాకారులకు డా. శోభా రాజు ఙ్ఞాపికలను అందించారు. చివరిగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి ఇచ్చారు. అనంతనం ప్రసాదాన్ని పంచిపెట్టారు.