శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో రసోల్లాస్ నేషనల్ ఇండియన్ డాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో సురేంద్రనాథ్, బిజినా అర్ధనారీశ్వరం, ఆదిత్య హృదయం అంశాలను ప్రదర్శించారు. మొహినియాట్టం నృత్య ప్రదర్శనలో అనిత ముక్త శౌర్య ముఖ చలం, చెల్లియో, కుంచనమో, అంశాలను, భరతనాట్య ప్రదర్శనలో ముంబై నుండి వచ్చిన ప్రముఖ కళాకారిణి కాశ్మీర త్రివేది బృందం అలరిపు, మహామృత్యుంజయ స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, తిల్లాన అంశాలను, ప్రియాంక బర్డె జయ దేవా అష్టపది, త్యాగరాయ కీర్తన, శ్రీ మహాగణపతే సురపాటే అంశాలను ప్రదశ్ర్శించి మెప్పించారు.
ఆంధ్రనాట్యం , పేరిణి నాట్య గురువు డాక్టర్ కళాకృష్ణకి నాట్య కళా కుసలా సాగర పురస్కారం ప్రదానం చేశారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మ ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, పూర్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ విజయ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులను అభినందించారు.