ప్రతి కాలనీ/బస్తీ అభివృద్దే లక్ష్యం: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు సాగుతామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ వద్ద స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం నెలకొన్న బస్తి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్ స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

ఆదిత్య నగర్ వద్ద నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో బస్తి నాయకులు మునఫ్ ఖాన్, రహీం, హనీఫ్, మహమ్మద్ ఖాజా, షోయబ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here