నమస్తే శేరిలింగంపల్లి : రాఖీ పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అన్న చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు, ప్రజలకు, ఆత్మీయ సోదర సోదరీమణులకు, ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ రక్షా బంధన్ తెలిపారు.
ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మహిళామణులు మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అడపడచులందరికి రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అని అన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో రమణి, లక్ష్మీ, రాధాబాయి, పద్మ , శ్రీ జ్యోతి, షేక్ బీబీ , శోభ,లక్ష్మీ దేవి, లలితమ్మ, సుమలత , పద్మ పాల్గొన్నారు.