దాదాపుగా 60 రోజుల నుంచి కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సమరం ముగింపుకు వచ్చేసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు, ఢిల్లీ క్యాపిటల్స్‌కు మధ్య మరికొద్ది గంటల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్లో ఢిల్లీ అన్ని జట్లకు టఫ్ ఫైట్ ఇచ్చినందున ఢిల్లీయే ఈసారి ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ 4 సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబైకి మళ్లీ ఈసారి కప్ వస్తుందని ఇంకొందరు అంటున్నారు.

ఇక కరోనా నేపథ్యంలో ఈసారి టోర్నీ చాలా ఆలస్యంగా జరిగింది. దీనికి తోడు బీసీసీఐకి ఈసారి భారీగా నష్టం వచ్చింది. అయితే ఆ నష్టాల ప్రభావం ఐపీఎల్ ప్రైజ్ మనీపై పడింది. దీంతో ఈసారి ఐపీఎల్ విజేతలకు రూ.20 కోట్లకు బదులుగా రూ.10 కోట్ల ప్రైజ్ మనీ అందివ్వనున్నారు. అలాగే రన్నర్స్ అప్‌కు రూ.12.50 కోట్లకు బదులుగా రూ.6.25 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.





