ఐపీఎల్ 2020 విన్న‌ర్‌, ర‌న్న‌ర్స్ అ‌ప్‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?

దాదాపుగా 60 రోజుల నుంచి కొన‌సాగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 స‌మ‌రం ముగింపుకు వ‌చ్చేసింది. డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ కు, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌ధ్య మ‌రికొద్ది గంట‌ల్లో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గనుంది. అయితే ఈ సీజ‌న్‌లో ఢిల్లీ అన్ని జ‌ట్ల‌కు ట‌ఫ్ ఫైట్ ఇచ్చినందున ఢిల్లీయే ఈసారి ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ 4 సార్లు చాంపియ‌న్‌గా నిలిచిన ముంబైకి మ‌ళ్లీ ఈసారి క‌ప్ వ‌స్తుంద‌ని ఇంకొంద‌రు అంటున్నారు.

do you know how much prize money for ipl 2020 winners and runners up

ఇక క‌రోనా నేప‌థ్యంలో ఈసారి టోర్నీ చాలా ఆల‌స్యంగా జ‌రిగింది. దీనికి తోడు బీసీసీఐకి ఈసారి భారీగా న‌ష్టం వ‌చ్చింది. అయితే ఆ న‌ష్టాల ప్ర‌భావం ఐపీఎల్ ప్రైజ్ మ‌నీపై ప‌డింది. దీంతో ఈసారి ఐపీఎల్ విజేత‌ల‌కు రూ.20 కోట్ల‌కు బ‌దులుగా రూ.10 కోట్ల ప్రైజ్ మ‌నీ అందివ్వ‌నున్నారు. అలాగే ర‌న్న‌ర్స్ అప్‌కు రూ.12.50 కోట్ల‌కు బ‌దులుగా రూ.6.25 కోట్ల ప్రైజ్ మ‌నీ ఇస్తారు. ఈ మేర‌కు బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here