హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్తి రఘునందన్ రావు గెలుపొందిన విషయం విదితమే. కాగా ఈ ఫలితాలపై తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. చివరి రౌండ్ ఫలితం వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై సమీక్షిస్తామని తెలిపారు.

తాము విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని కేటీఆర్ అన్నారు. దుబ్బాకలో కచ్చితంగా గెలుస్తామనుకున్నామని, కానీ తాము ఆశించిన ఫలితం రాలేదన్నారు. తమకు ఓటు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆరున్నర ఏళ్లలో తెరాస ఎన్నో విజయాలు సాధించిందని, దుబ్బాక తీర్పుపై తాము లోతుగా సమీక్ష చేస్తామని తెలిపారు. రాజకీయాల్లో గెలవాలనే కోరికతోనే ఎవరైనా పోటీ చేస్తారని అన్నారు. ఈ ఓటమి వల్ల తాము అప్రమత్తం అవుతామని తెలిపారు.





