శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆరెకపూడి గాంధీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గోపీనగర్, ఆదర్శ్ నగర్, పాపిరెడ్డి నగర్, లింగంపల్లి, శ్రీరాంనగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు. యూజీడీ పనులు దాదాపు పూర్తయ్యాయని, సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సమావేశంలో ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.