చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని గంగారం పెద్ద చెరువును అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డిలు ఆరోపించారు. సోమవారం గంగారం పెద్ద చెరువును భారతీయ జనతా పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో కసిరెడ్డి భాస్కరరెడ్డి, పోరెడ్డి బుచ్చిరెడ్డిలు సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గంగారం పెద్ద చెరువును అభివృద్ధి చేస్తామని రూ.పదుల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని, అయినప్పటికీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అభివృద్ది పేరిట గంగారం పెద్ద చెరువు కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని, కానీ చుట్టు పక్కల అపార్ట్‌మెంట్ల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు చెరువులో కలుస్తున్నాయని అన్నారు.
అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అధిక వర్షపాతం నమోదైనప్పుడు చెరువు నీటిని కిందకు విడుదల చేయడానికి ఏర్పాటు చేసిన తూములను పూర్తిగా తొలగించివేశారని పేర్కొన్నారు. పూర్తి 130 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు సింహభాగం కబ్జాకు గురికాగా, మిగిలిన చెరువునైనా కాపాడాలని, తద్వారా భూగర్భ జలాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, నూనె సురేందర్, రాకేష్ దూబే, వేణుగోపాల్ పగడాల, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీవాణి, లలిత, లీలా రాణి, అమరేందర్, ప్రవీణ్, నరేందర్ రెడ్డి, రవికాంత్, యువమోర్చ నాయకులు మథు, అభిలాష్, అజయ్, అనీష్, లోహిత్, మురళి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.