ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళినగర్ ఆశానగర్ కు చెందిన దయానంద్ (65) గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, నాయకులు రమేష్, సంగారెడ్డి, లక్ష్మణ్, సూరిబాబు పాల్గొన్నారు.