- కాంగ్రెస్ లో చేరిక.. సాదరంగా ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా పాలన, ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. అంతేకాక పలు పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ వెంటే ఉంటామంటూ ఆ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్, బిజెపి ల నుంచి కాంగ్రెస్ బాట పట్టారు.
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు కరుణాకర్ గౌడ్, కుమార్ యాదవ్, రామచందర్, లక్ష్మ రెడ్డి పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్ రావు, రవీందర్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.