- తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక 20 24 క్యాలెండర్ ఆవిష్కరించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక 20 24 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా న్యాయం చేయటానికి అసెంబ్లీలో బీసీ కుల గణన చేేందుకు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పేర్కొన్నారు. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరు పేదలకు సాయం చేయటానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. శేరిలింగంపల్లి బీసీలకు స్థానం కల్పిస్తూ న్యాయం చేయటానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీ జనగణన సంతోష్ దాయకంమని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయటానికి ముందడుగు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. శేరిలింగంపల్లి ద్వారా మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు వేసి ఐకమత్యం చాటుతామన్నారు. శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలమని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని నమ్మకం కలిగిందని, తమ న్యాయమైన డిమాండ్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ముందుకు పోదామని పిలుపునిచ్చారు.
బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మాట్లాడుతూ ధనస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ కులాలే కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తో పాటు జనగణన చేయడం ఉప ముఖ్యమంత్రి బట్టి అసెంబ్లీలో అనౌన్స్ చేయడం ప్రజాస్వామ్య పోకడలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు నరసింహ ముదిరాజ్ సిరి లింగంపల్లి ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షులు నరసింహ ముదిరాజ్ కార్యదర్శి మక్బూల్ భాయ్ మహిళా అధ్యక్ష కార్యదర్శులు సరోజ వెంకటమ్మ అనేకమంది కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు