నమస్తే శేరిలింగంపల్లి : ప్రతి కాలనీ, బస్తీలలో సమూల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోనీ ఓయూ ప్రొఫెసర్ కాలనీలో రూ. 80 లక్షలు అంచనా వ్యయంతోనూ, ప్రేమ్ నగర్ ఏ బ్లాకు డంపింగ్ ఏరియాలో రూ. 23 లక్షలు అంచనా వ్యయంతోనూ జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనుల తీరును పర్యవేక్షించారు.
జలమండలి అధికారి మేనేజర్ విక్రమ్ రెడ్డి, స్థానిక నాయకులు సయ్యద్ ఉస్మాన్, మాక్బుల్ చిచ్చా, అజ్జు, మోబిన్, నియామత్ పాల్గొన్నారు.