నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓఎస్డీ గా సత్యనారాయణ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను తన నివాసంలో తెలంగాణ ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ఆర్టిఐ చట్టం గురించి వివరించి ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఆర్టిఐ చట్టం పోరాటం చేస్తుందని వివరించారు.
ఓ ఎస్ డి దీనికి సానుకూలంగా స్పందించి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం – 2005 అనేది ప్రతి పబ్లిక్ అథారిటీ పనిలో పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, ప్రభుత్వ అధికారుల నియంత్రణలో సమాచారాన్ని పొందేందుకు పౌరులకు సమాచార హక్కు, ఆచరణాత్మక పాలనను ఏర్పాటు చేయడానికి ఒక చట్టం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్రవంతి, బబ్లూ, భోగం విష్ణు, అఖిల, పాల్గొన్నారు.