శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): దోమలు వృద్ధి చెందకుండా లార్వాను నిర్మూలించేందుకు డ్రోన్ ద్వారా ఫైరోసిన్ ఆయిల్ మిశ్రమాన్ని పిచికారి చేయడం జరుగుతుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని చాకలి చెరువులో దోమల వృద్ధిని అరికట్టేందుకు డ్రోన్ ద్వారా ఫైరోసిన్ ఆయిల్ మిశ్రమ పిచికారిని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. చెరువుల్లో లార్వాను నివారించేందుకు ఇదొక చక్కటి మార్గమన్నారు. 15 రోజులకోసారి ఎంటమాలజీ సిబ్బంది వారు చెరువుల్లో డ్రోన్ల సహాయంతో దోమల నివారణ కోసం మిశ్రమాన్ని పిచికారి చేయడం జరుగుతుందన్నారు. దోమల నివారణతో ప్రజల ఆరోగ్యాలను కాపాడిన వారమవుతామని రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. ఆయన వెంట సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్, ఎంటమాలజీ ఏఈ కిరణ్, సిబ్బంది గోపాల్, మల్లేష్, ఉన్నారు.







