చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో కొలువై ఉన్న భవాని అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా సుప్రభాత హారతి, విశేష పంచామృత అభిషేకం, విశేష పుష్ప అలంకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి, భవానీ ఆలయ అర్చకుడు రవిశర్మ, పాలకమండలి సభ్యులు, దేవాలయ సేవాసమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.






