- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): దేశ ప్రజల ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని మరువలేమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్ అన్నారు. భారత దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా డివిజన్ పరిధిలోనీ బీజేపీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా, లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద పటేల్ చిత్రపటానికి నంద కుమార్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నంద కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దాదాపుగా 560 చిన్న చిన్న సంస్థానాలను భరతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి పటేల్ అని కొనియాడారు. నేటి తరం యువత పటేల్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమాలలో బీజేపీ జిల్లా నాయకుడు చింతకింది గోవర్ధన్ గౌడ్, నాయకులు మారం వెంకట్, చంద్రమోహన్ గారు, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, వడ్ల ప్రశాంత్ చారి, పాండు గౌడ్, శ్రవణ్ పాండే, మనోజ్ ముదిరాజ్, పల్లపు రవీందర్, గిరిజన మొర్చా అధ్యక్షుడు అశోక్ నాయక్, విఠల్ రాథోడ్, రాకేష్ నాయక్, బాస్య నాయక్, భరత్ రాజ్, అరవింద్ గౌడ్, తుకారాం, కిషోర్ యాదవ్, మనోహర్ యాదవ్, గూర్ల చందు, వివేక్, విక్కి, నిశాంత్, సాయి, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.