దుబ్బాకలో కొన‌సాగుతున్న శేరిలింగంప‌ల్లి బీజేపీ నాయ‌కుల ప్ర‌చారం

దుబ్బాక (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దుబ్బాక‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో శేరిలింగంప‌ల్లికి చెందిన బీజేపీ, బీజేవైఎం నాయకులు శ‌నివారం ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దుబ్బాక‌లోని చేగుంట మండ‌లం, కార‌ణంప‌ల్లి, పోలంప‌ల్లి గ్రామాల్లో వారు ప్ర‌చారం చేపట్టారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం ప్ర‌వేశపెడుతున్న ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తూ బీజేపీకి ఓటు వేయాల‌ని కోరారు.

బీజేపీకి ఓటు వేయాల‌ని కోరుతున్న నాయ‌కులు
బీజేపీకి ఓటు వేయాల‌ని కోరుతున్న నాయ‌కులు

ఈ కార్య‌క్ర‌మంలో రాజాసింగ్‌, ఎస్సీ క‌మిష‌న్ సభ్యుడు రాములు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్త్, సునీల్ కుమార్, సాయిరాం, హరిప్రియ, శేరిలింగంపల్లి నాయకులు తాండ్ర వేణు, కృష్ణకాంత్, అరుణ్, శరణ్ కుమార్, జైరాం గౌడ్, శ్రీరామ్, బీజేపీ నాయకులు శివకుమార్, సత్య, సతీష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here