ఘనంగా త్రివేణి విద్యాసంస్థల అధినేత డా.గొల్లపూడి వీరేంద్ర చౌదరి జన్మదిన వేడుకలు

మియాపూర్ త్రివేణి శాఖలో సిబ్బంది సమక్షంలో కేకును కట్ చేస్తున్న వీరేంద్ర చౌదరి

నమస్తే శేరిలింగంపల్లి: త్రివేణి విద్యా సంస్థల అధినేత డా.గొల్లపూడి వీరేంద్ర చౌదరికి సంస్థ సిబ్బంది ఘనంగ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నడుమ వీరేంద్ర చౌదరి జన్మదిన వేడుకలు జరుపుకోనున్నారు. కాగా హైదరాబాదులోని మియాపూర్ బ్రాంచ్ లో శనివారం ముందస్తుగా సంస్థ సిబ్బంది ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఆయనచేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదిన వేడుకల్లో వీరేంద్ర చౌదరికి శుభాకాంక్షలు తెలుపుతున్న త్రివేణి సిబ్బంది

అధినేత జన్మదినాన్ని పురస్కరించుకొని త్రివేణి కుటుంబం వీరేంద్ర చౌదరి నిర్వహించిన సేవా కార్యక్రమాలు, సాధించిన అవార్డులు తదితర విశేషాలతో కూడిన 2021 కేలండర్ ను రూపొందించారు. వీరేంద్ర చౌదరి పట్ల వారికి గల అభిమానాన్ని త్రివేణి వీరుడా… త్రిగుణాల ధీరుడా… మీరే మాకు మార్గదర్శి.! స్ఫూర్తి ప్రదాత.!! అంటూ అక్షర రూపంలో అన్వయించి తమ అనుబంధాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here