భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీలో సుమారుగా రూ.1 కోటి అంచనావ్యయంతో నిర్మించనున్న థీమ్ పార్క్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ఈ థీమ్ పార్క్ వల్ల చుట్టు పక్కల నివాసం ఉండే ప్రజలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను, పిల్లల కోసం ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పార్కు పనులను త్వరగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈశ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, సంపత్, చిన్నా, రాజేష్, భాస్కర్, రాధాకృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, వెంకటేశ్వర రావు, టింకు, డానియల్, సురేందర్, సత్యనారయణ, జ్యోతి, అనిత, మస్తాన్ బేబీ, లక్ష్మీ, స్వర్ణ లత, శ్రీలత, ప్రతాప్, ఆంజనేయులు, వెంకట్ పాల్గొన్నారు.

బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన…
భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీలో సుమారుగా రూ.64 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునరుద్ధరణ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. రోడ్డు పునరుద్ధరణ పనులను త్వరగా చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మియాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, సంపత్, చిన్నా, రాజేష్, భాస్కర్, రాధాకృష్ణ, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, వెంకటేశ్వర రావు, టింకు, డానియల్, సురేందర్, సత్యనారయణ, జ్యోతి, అనిత, మస్తాన్ బేబీ, లక్ష్మీ, స్వర్ణ లత, శ్రీలత, ప్రతాప్, ఆంజనేయులు, వెంకట్ పాల్గొన్నారు.






