హోప్ ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో హాకీ క్రీడాకారిణికి స‌హాయం

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క్రీడాకారులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రం పేరును నిల‌బెట్టాల‌ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్ర‌వారం గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని జీపీఆర్ఏ క్వార్ట‌ర్స్‌కు చెందిన ఈదుల జ్యోతి అనే క్రీడాకారిణికి హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్ కుమార్ ఆధ్వ‌ర్యంలో గాంధీ చేతుల మీదుగా రూ.15వేల ఆర్థిక స‌హాయం అందజేశారు. భోపాల్ లో జ‌ర‌గ‌నున్న జాతీయ హాకీ శిక్ష‌ణ శిబిరానికి జ్యోతి ఎంపిక కాగా ఆమెకు ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులు చ‌దువుల‌తోపాటు క్రీడ‌ల్లోనూ రాణించాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని అన్నారు. క్రీడాకారుల‌కు హోప్ ఫౌండేషన్ స‌హాయం అందిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, క్రీడాకారిణి తండ్రి శివ నాగి రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

హాకీ క్రీడాకారిణి ఈదుల జ్యోతికి స‌హాయం అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హోప్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ కొండా విజ‌య్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here