- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ, వేముకుంట బస్తీ, శివాజీ నగర్ బస్తీ, వేమన వీకర్ సెక్షన్ బస్తీ, ఇందిరా నగర్ బస్తీలలో వరద ముంపు వలన నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని డీసీ సుధాంష్ తో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి వరద బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.