- వివేకానందనగర్‌లో బీజేపీ నాయకుల నిరసన
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): పోలీసుల అక్రమ అరెస్టులతో దుబ్బాకలో బీజేపీ గెలుపును ఆపలేరని వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని కమాన్ వద్ద పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడికి నిరసనగా నాయకులు ఉప్పల ఏకాంత గౌడ్, చౌదరి ధర్మారావులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాకలో ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభాలకు గురిచేసినా వారు బీజేపీకి ఓటు వేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారని, కనుక గెలుపు బీజేపీదేనన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నామాల శ్రీనివాస్, శ్రీనివాస్, అశోక్, సాయి కిరణ్, అనిల్, భాస్కర్, అరవింద్ యాదవ్, రాజు గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.