గంగారం గ్రామంలో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

హ‌ఫీజ్‌పేట‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని గంగారం గ్రామంలో వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందజేసిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని కార్పొరేట‌ర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ మంగ‌ళ‌వారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ‌ర‌ద బాధితులంద‌రినీ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని అన్నారు. ఏ ఒక్క‌రూ న‌ష్ట‌పోకుండా చూస్తామ‌ని తెలిపారు. ఆమె వెంట తెరాస నాయ‌కులు, కార్య‌కర్త‌లు ఉన్నారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here